వాళ్లు అనుకున్నవన్నీ కావాలంటే ఎలా? : మంత్రి బొత్స
ప్రభుత్వాలను బెదరిస్తామంటే పనులు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసునని వ్యాఖ్యానించారు. వాళ్లు అనుకున్నవన్నీ కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు 8 గంటల పని ఎందుకు చేయరని నిలదీశారు. ఉద్యోగ రీత్యా సమస్యలు ఉంటే మాత్రమే ఉపాధ్యాయులు తమ దృష్టికి తేవాలంటూ స్పష్టం చేశారు. ఉద్యమాలు చేస్తున్న టీచర్లు తమ పిల్లలను ఎక్కడ చదవిస్తున్నారని ప్రశ్నించిన అంశాలు మీడియాలో వచ్చాయన్నారు. హెడ్డింగ్లు అటు ఇటు మారినా తన భావాలను ప్రజలకు తెలిపారంటూ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.













