ఏపీలో లాక్‍డౌన్ పెడితే.. రాష్ట్రం

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో లాక్‍డౌన్ పెడితే రాష్ట్రం మరింత సంక్షోభవంలో కూరుకుపోతుందని వైఎస్సార్‍సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం జగన్ పాలన చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం జగన్ పాలన ఉందన్నారు. ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. మా పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు.