సజ్జల దివాకర్ రెడ్డి కన్నుమూత
ఆంధప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు, పారిశ్రామికవేత్త దివాకర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దివాకర్‌రెడ్డి మృతి పట్ల ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. సజ్జల దివాకర్‌రెడ్డి పట్ల ఏపీ ప్రభుత్వం జాతీయ మీడియా సలహాదారు దేవుపల్లి అమర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సోదరుడిని కోల్పోయిన ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డికి, వారి కటుంబానికి నా సానుభూతి. సోదరులిద్దరూ నాకు చిరకాల వ్యక్తిగత మిత్రులు అని దేవులపల్లి అమర్ పేర్కొన్నారు.













