ఏపీలో ముందే వచ్చిన సంక్రాంతి…
ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. రేపు (29వ తేదీ) రైతు భరోసా, నివర్ తుపాను నష్టం పరిహారం చెల్లింపులను ప్రభుత్వం చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత రూ.1,120 కోట్లు చెల్లింపులతో 51.59 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. నివర్ తుపాన్ కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది. రూ.646 కోట్లు నివర్ పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాట ప్రకారం తుపాను బాధితులకు పరిహారం అందనుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా తుపాను బాధితులకు వైఎస్ జగన్ ప్రభుత్వం పరిహారం అందిస్తుంది.













