వైసీపీ తుది జాబితా..ఆ ఇద్దరు సేఫ్..
ఎన్నికల నగారా మోగింది.. మరోపక్క పార్టీలు కూడా తమ క్యాండిడేట్ల జాబితాలను ఫైనల్ చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈరోజు వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత వైసీపీ లో రిలాక్స్ అయిన నేతలు ఇద్దరు. ఒకరు నగిరి ఎమ్మెల్యే రోజా.. మరొకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈసారి ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ ప్రచారం మొదలుపెట్టి జగన్.. పార్టీలో కొందరు సీనియర్ నేతలకి చెక్ పెట్టాలి అని భావిస్తున్నట్లు టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో నగిరి ఎమ్మెల్యే టికెట్ రోజాకి దక్కకపోవచ్చు అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈరోజు ప్రకటించిన లిస్టులో రోజా స్థానం సేఫ్ అన్న విషయం క్లియర్ అయ్యింది. ఇక వల్లభనేని వంశీ గత కొన్ని వారాలుగా ఎక్కడా కనిపించ లేదు. దీంతో గన్నవరం నుంచి అతని టికెట్‌పై పలు అనుమానాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతానికి ఈ ఇద్దరూ తమ టికెట్లు సేవ్ చేసుకున్నారు .. అయితే అసలు ఫ్లాన్ మొదలయ్యేది ఇప్పుడే కదా. ఇక ఎన్నికల్లో ఈ ఇద్దరు గెలుపు పై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.













