కూలిన జానపద శిఖరం… వంగపండు ఇక లేరు
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77)కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1972 జననాట్య మండలిని స్థాపించి, తన జానపద గేయాలతో పల్లెకారులతో పాటు గిరిజనులను వంగపండు ఎంతగానో చైతన్యపరిచారు. తన జీవిత కాలంలో వందలాది ఉత్తరాంధ్ర జానపదాలకు వంగపండు గజ్టెకట్టాడు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో వంగపండు ప్రఖ్యాతి చెందారు. అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం మొదలైంది. 2017లో ఆంధప్రదేశ్ ప్రభుత్వం చేత కళారత్న పురస్కారం అందుకున్నారు.













