అమలు జరపకపోతే.. మేం అక్కడికొస్తాం
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీ బడ్జెట్‌ను ఎంత పారదర్శకతతో రూపొందించారో… అదే విధంగా నెరవేర్చవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. గత ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారు. కాబట్టే అటు వైపు నుంచి ఇటు వచ్చారని అన్నారు. వైసీపీ కూడా బడ్జెట్‌ను తూ.చా. తప్పకుండా అమలు చేయకపోతే జనసేన మీ స్థానంలో వచ్చే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజల్ని విస్మరిస్తే ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చునని అన్నారు.













