సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా : రఘురామ
రాజీనామా విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అనర్హత వేటుకు వైసీపీ నేతలకు ఈ నెల 11 వరకు సమయమిచ్చానని, కానీ వారి అది సాధ్యపడలేని అన్నారు. తాను ఫిబ్రవరి 5నే రాజీనామా చేస్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇక నా వల్ల కాదు నువ్వే రాజీనామా చెయ్యు అని సీఎం జగన్ అంటే అప్పుడు చేస్తా అని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో ఎలా కాళ్ల బేరానికి వచ్చారు? అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు వారి నేతలను తక్షణమే వదిలించుకోవాలన్నారు. సీఎం జగనా లేక సజ్జలా అనేది ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. తనపై అనర్హత వేటు వేయకపోతే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు వెళ్తానని రాఘురామ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.













