ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్కు టైం : రఘురామ
ఫ్రిబవరి 11 వరకు అనర్హత వేటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టైం ఇస్తున్నా, ఏం చేస్తారో చేసుకోండి అని ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో మోసం చేసిన ప్రభుత్వంపై రైతులు కేసు పెట్టాలని పిలుపునిచ్చారు. 3 రాజధానులు తెచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోర్టులో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మాజీమంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో పురోగతి రావొచ్చన్నారు. జిల్లాల విభజన విషయంలో వైసీపీ కేడర్ కూడా మండిపడుతోందన్నారు. డ్రగ్స్ నియంత్రణపై సీఎం సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.













