వైఎస్ షర్మిలకు ఒక రూల్… ఏపీ మహిళలకు మరొక రూలా?
వైఎస్ షర్మిలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వైఎస్ విజయమ్మకు అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న మహిళా రైతులపై పోలీసుల దాడులు గుర్తుకురాలేదా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిలకు ఒక రూల్, ఏపీ మహిళలకు మరొక రూలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఏపీలో మహిళలపై దాడులు జరిగితే విజయమ్మ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అమరావతిలో మహిళలను ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వడం లేదన్నారు. అమరావతిలో జరుగుతున్న దౌర్జన్యాలపై పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ మాట్లాడాలని, తద్వారా పార్టీ గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు.













