హోంమంత్రి అనితకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కార్యకర్తలు కాకినాడలో ఆందోళన నిర్వహించారు. అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి పసుపులేటి చిన్నబాబు (Pasupuleti Chinnababu) మాట్లాడుతూ మహిళా మంత్రిని అవమానకరంగా దూషించిన రాంబాబు తీరు దారుణమన్నారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చర్యలు చేపట్టకపోతే మాదిగలు, మహిళా సమాజం ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.








