పశ్చిమగోదావరి జిల్లా యువతికి ప్రధాని ఆర్థిక సాయం
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి కాలేయమార్పిడికి ప్రధాని నరేంద్రమోదీ తన సహాయ నిధి ద్వారా రూ.మూడు లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. కాళ్ల మండలం ప్రాతాళమెరకకు చెందిన పావని కాలేయ సమస్యతో బాధపడుతోంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు జోక్యం చేసుకుని ఆమెకు ప్రధాని సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించమంటూ ప్రధాని మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై ప్రధాని కార్యాలయం స్పందించి పావని శస్త్రచికిత్సల నిమిత్తం రూ. మూడు లక్షలను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి నిధులు విడుదల చేసినట్టు రఘురామకృష్ణంరాజు తెలిపారు.













