ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 నాణెం.. ఆవిష్కరించనున్న రాష్ట్రపతి
నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్ధం కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 నాణెం ముద్రించాలని నిర్ణయించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ఈ నిర్ణయంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ హైదరాబాద్‌లోని మింట్‌కు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం ముద్రించి సిద్ధం చేశారని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ నెల 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు వందమందిని ఆహ్వానించారని పురందేశ్వరి తెలిపారు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో నాణెం తయారీ ఉండాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.













