చర్చలకు మేం సిద్ధమే కానీ… ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో లేదని వ్యాఖ్యానించారు. మాటల ద్వారా మమ్మల్ని చర్చలకు రాకుండా చేస్తున్నారని తెలిపారు. చర్చలకు ముందు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. సమస్యలపై తాము ఇప్పటికే వందల దరఖాస్తులు ఇచ్చామని అన్నారు. తాము ఇచ్చిన 859 అభ్యర్థనలు పెండిరగ్ ఉన్నాయని సీఎస్ చెప్పారని అన్నారు. కాగితాలపై పుట్టిన సంఘాలతో చర్చించి న్యాయం చేసినా మంచిదేనని వ్యాఖ్యానించారు.













