Amaravati : అమరావతికి ప్రధాని మోదీ రాక?
రాజధాని అమరావతి (Amaravati) పునర్నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాజధానిలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ (Modi) చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ (April) 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని వచ్చే అవకాశముంది. తొలి దశలో రాజధానిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.64.721 కోట్లు వెచ్చించనుంది. రూ.37,702 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు (Tenders )ఖరారు చేసింది. నిర్మాణ పనులకు మిషన్ మోడ్లో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 17న రాష్ట్ర క్యాబినెట్ (State Cabinet ) సమావేశంలో ఆమోదం తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు జారీ చేయనుంది. వర్క్ ఆర్డర్లు జారీ కాగానే ఏజెన్సీలు పనులను ప్రారంభించనున్నాయి.













