మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల.. తొలి సంతకం దానిపైనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు రూ.250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యావుల తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని వ్యాపారాలు చేసుకోలేనంత స్థాయిలో పన్నులను పెంచడంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. పన్నులు తక్కువగా ఉన్నాయని పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొంటున్నారు. పెట్రోల్ కొట్టించుకుంటున్నారని గుర్తు చేశారు.













