Budget : రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ (Budget)ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయాని (Agriculture) కి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం (Revenue expenditure) రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.రూ40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33.185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project ) కోసం బడ్జెట్లో రూ.6,705 కోట్లు కేటాయించారు.













