పవన్ ‘వారాహి యాత్ర’ తొలి దశ షెడ్యూల్ ఇదే..!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సమర శంఖారావం పూరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి బస్సులో యాత్ర మొదలుపెట్టనున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపించి, అనంతరం తన పొలిటికల్ యాత్రను పవన్ మొదలు పెడతారు. ఈ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలోనే పవర్ సభల షెడ్యూల్ను జనసేన పార్టీ విడుదల చేసింది. జూన్ 14వ తేదీన కత్తిపూడిలో పవన్ తొలి సభ జరుగుతుంది. ఈ యాత్ర తొలి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర జరుగుతుంది.
పవన్ బహిరంగ సభల షెడ్యూల్
జూన్ 14- కత్తిపూడి సభ
జూన్ 16- పిఠాపురంలో వారాహి యాత్ర, సభ
జూన్ 18- కాకినాడలో వారాహి యాత్ర, సభ
జూన్ 20- ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ
జూన్ 21- అమలాపురంలో వారాహి యాత్ర, సభ
జూన్ 22- పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, మలికిపురంలో సభ
జూన్ 23- నరసాపురంలో వారాహి యాత్ర, సభ













