పిఠాపురంలో పర్యటించనున్న జనసేనాని..
నిన్న మొన్నటి వరకు ప్రతి ప్రాంతం నాదే అంటూ తిరిగాడు పవన్ కళ్యాణ్. అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం కన్ఫామ్ అయిన తర్వాత నుంచి పూర్తి ఫోకస్ పిఠాపురం పై పెట్టడానికి పవన్ ఫిక్స్ అయిపోయారు. ఈసారి ఎలాగైనా పోటీ చేస్తున్న నియోజకవర్గ నుంచి గెలవాలి అన్న పట్టుదల పవన్ కళ్యాణ్ లో బాగా కనిపిస్తోంది. అందుకే పిఠాపురంలో కచ్చితంగా గెలుపే ధ్యేయంగా పవన్ తన పావులని కదుపుతున్నారు. అభ్యర్థిగా ఖరారు అయిన తర్వాత ఆయన తొలిసారిగా పిఠాపురం అని పర్యటించడానికి కూడా నిర్ణయించుకున్నారట. ఇక వచ్చేవారం పవన్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు అని టాక్. నియోజకవర్గంలో పర్యటించడంతోపాటు తన స్టైల్ లో ఓట్ల అభ్యర్థించడానికి జనసేనని ఫిక్స్ అయిపోయాడు. ఇక ఈ పర్యటనలో జగన్ పార్టీపై ఏ రేంజ్ టపాసులు పేలుతాయో చూడాలి మరి. పర్యటనలో భాగంగా జనసేన శ్రేణులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం కూడా చేయబోతున్నారట. పిఠాపురంలో పవన్ పాగా వేయడంలో ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాడో రిజల్ట్స్ వస్తే కానీ తెలియదు.













