జనసేన అధ్యక్షుడు అసెంబ్లీ స్థానం ఖారారు!
వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసే స్థానం ఖరారైనట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ ఉత్తరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారని తెలుస్తుండగా, ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుండడంతో జిల్లా వాసుల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది.













