ఆ బాధితులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం: పవన్
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇటీవల ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలబడ్డారు. బాధితులకు ఆయన రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటిచారు. వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి ఇప్పటంలో ఇళ్లు దెబ్బతిన్నవారు, అవాసాలు కోల్పోయిన వారికి రూ.లక్షల చొప్పున అందజేయాలని పవన్ నిర్ణయించారు. మార్చి 14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు గ్రామస్థులు సహకరించి సభాస్థలి ఇచ్చారు. అందుకే వారిపై కక్షగట్టి పోలీసులను మోహరించి జేసీబీలతో ఇళ్లు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో రూ.లక్ష చొప్పున పవన్ ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే ఆయన స్వయంగా బాధితులకు అందజేస్తారు అని మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరిట దాదాపు 53 ఇళ్లను ఇటవలే అధికారులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.













