అడ్జస్ట్మెంట్స్ తో సతమతమవుతున్న పవన్..
కూటమిలో భాగంగా తమకు కేటాయించిన సీట్ల ను క్యాండిడేట్లకు అడ్జస్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ డిక్లేర్ చేసిన నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా మారుస్తున్నారు. కూటమిలో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలోకే వచ్చింది.ఉమ్మడి కడప జిల్లా, రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా తొలుత యనమల భాస్కరరావు పేరు ప్రకటించారు. అయితే ఇప్పుడు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అందిన నివేదికల ప్రకారం.. జిల్లా నాయకుల అభిప్రాయాలను అనుసరించి ఇతర జనసేన నేతలతో ముచ్చటించాకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం అరవ శ్రీధర్ జనసేన పార్టీలో చేరడం గమనార్హం. ఇంతకుముందు అతను ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్ గా ఉన్నారు. రైల్వే కోడూరులో స్థానిక నేతల సపోర్ట్ ఇతనికి బాగా ఉండటంతో పాటు ప్రజలలో కూడా మంచి పేరు ఉందట.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తున్నట్లు అనిపిస్తోంది.













