రాజమహేంద్రవరంలో పాస్పోర్ట్ సేవలు
త్వరలో తపాలా శాఖ ద్వారా పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టుమాస్టర్ జనరల్ కె.సుబ్రమణియన్ అన్నారు. తూర్పగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ స్మారక తపాలా బిళ్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు వైజాగ్లో మాత్రమే లభించే పాస్పోర్టు సేవలు 2018 నుంచి రాజమహేంద్రవరంలో తపాలా శాఖ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇందుకోసం సంబంధిత కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు 130 మందిని నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని వెల్లడించారు.













