పోలవరం పూర్తి చేసేది… రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబే
ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ ఆధోగతి పాల్జేశారని తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం పనులు 72 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఒక్క రోజులో 35 వేల క్యూబిక్ మీటర్ల కాంట్రీక్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. అయిదేళ్ల అధికారంలో ఉన్న జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. సకాలంలో పోలవరం పూర్తయి ఉంటే 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశాకు కూడా నీళ్లిచ్చే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండేదని తెలిపారు. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబేనని ఉద్ఘాటించారు.













