సీఎంపై విమర్శలు చేస్తే ఊరుకోం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరు ఉందని విమర్శించారు. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే ఏదైనా పార్టీ కండువా కప్పుకొని నేరుగా మాట్లాడాలని సూచించారు. సీఎస్, వైఎస్ జగన్, ప్రధాని మోదీకి కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎస్ ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 172 ప్రకారం సీఎంకు సమీక్ష చేసే అధికారం ఉన్నా సీఎస్ లేదు అని ఎలా అంటారని ఆమె మండిపడ్డారు.













