ప్రవాసాంధ్రులు ఓటుహక్కును వినియోగించుకోవాలి: డా.పిల్ గురురాజా
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్వస్థలాలకు వచ్చి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని గ్లోబల్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ పిల్ గురురాజా కోరారు. కూటమి అభ్యర్థుల విజయానికి సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా కృషి చేయాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.








