టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి నోటీసులు
108 వాహనాల కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగిందని లెక్కలతో సహా చెప్పిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. అప్పట్లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ విషయమై ఆంధప్రదేశ్ ప్రభుత్వం పట్టాభికి నోటీసులు పంపింది. 108 వాహనాల కాంట్రాక్ట్‌లో అవినీతి జరిగిందన్న వ్యాఖ్యలపై ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో ఉంది. అయితే ఈ నోటీసులపై పట్టాభి మాత్రం రియాక్ట్ అవ్వలేదు.













