ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రమేశ్‌కుమార్
వ్యక్తులు కాదు, రాజ్యాంగ సంస్థలు, విలువలు శాశ్వతమని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సృష్టం చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత ఆయన ఎన్నికల కమిషనర్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారిపై వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయలు తీసుకుని ఎన్నికల పక్రియను ప్రారంభిస్తామన్నారు. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.













