మళ్లీ పదవిలోకి వచ్చాను : నిమ్మగడ్డ
ఆంధప్రదేశ్ హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మళ్లీ పదవిలోకి వచ్చానని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని సృష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు. వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయని అన్నారు.













