గోవిందమ్మకు నైటింగేల్ అవార్డు ప్రదానం
వైద్య ఆరోగ్యశాఖలో సేవలందించిన నర్సులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అందించే ప్రతిష్ఠాత్మక జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ నర్సు అవార్డును ఆంధ్రప్రదేశ్ నుంచి వేజండ్ల గోవిందమ్మ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు ఈ పురస్కారాన్ని బహుకరించారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన గోవిందమ్మ కనగాల ప్రాథహిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్నారు. 18 ఏళ్ల వృత్తి జీవితంలో ప్రభుత్వ ఆరోగ్య పథాకలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె కృషి చేశారు. బాలింతలు, గర్భిణులు, వైద్యశాలకు వచ్చే రోగులకు నిరంతరం విశేష సేవలందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఆమె పలు అవార్డులు అందుకొన్నారు. తొలిసారిగా ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికయ్యారు.













