జగన్ లాంటి వ్యక్తికి మరో ఛాన్స్ ఇస్తే.. అన్నీ : లోకేశ్
జగన్ చెప్పిన నవరత్నాలు నవమోసాలుగా మారాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనకాపల్లిలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడారు. జగన్ లాంటి వ్యక్తికి మరో ఛాన్స్ ఇస్తే అన్నీ దోచేస్తారని ఎద్దేవా చేశారు. సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఆదరిస్తారా? అని ప్రశ్నించారు. మరో రెండు నెలల్లో ప్రజలు జగన్ కుర్చీని మడతపెట్టడం ఖాయమన్నారు. విశాఖకు రైల్వే జోన్, మైట్రో రైలు తెస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం, ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. టీడీపీ సూపర్ సిక్స్ ద్వారా అన్ని వర్గాలకు మేలు చేస్తామని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన హలో ఏపీ.. బై బై వైసీపీ నినాదానికి పసుపు సైన్యం, జన సైనికులు కట్టుబడి ఉండాలని కోరారు.













