‘యంగ్ గ్లోబల్ లీడర్’ హోదాలో లోకేశ్
ప్రపంచ ఆర్థిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ యంగ్ గ్లోబల్ లీడర్ హోదాలో పాల్గొన్నారు. లోకేశ్ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అధునికతను జోడించి గ్రామాల అభివృద్ధి, తాగునీటి సరఫరాతో సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకుని ప్రపంచ ఆర్థిక వేదిక ఆయనను యంగ్ గ్లోబల్ లీడర్‌గా గుర్తించింది. ఈ హోదాలో ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల మధ్య సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందించే అంశంపై చర్చ జరిగింది. అనంతరం నగరాల్లో పారిశుధ్య నిర్వహణ అన్న అంశంపై జరిగిన చర్చలో లోకేశ్ పాల్గొన్నారు.













