నారా, నందమూరి కుటుంబాలు కీలక నిర్ణయం
సంక్రాంతి సందర్భంగా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు రానున్నాయి. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏటా సంక్రాంతికి సొంతూరికి రావడం ఆనవాయితీ. అమరావతిలో రైతుల దీక్ష, కరోనా కారణంగా రెండేళ్లు రాదు. మూడేళ్ల తర్వాత సంక్రాంతి పండగకు రానుండటంతో ఆ గ్రామంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ఇంటికి పెయింటింగ్ వేసి, ఆవరణలో రంగులతో తీర్చిదిద్దారు. చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులు, కులదైవం నాగాలమ్మ ఆలయం, గ్రామ దేవతల వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. పార్కింగ్, భద్రతా సిబ్బంది ఉండటానికి టీటీడీ కల్యాణ మండపం, పరిసరాలను శుభ్రం చేశారు. ఈనెల 12వ తేదీన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ రానున్నారు. 13న చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రానున్నట్లు సమాచారం. వీరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా రానున్నారు. సంక్రాంతి పండుగ జరుపుకొని 16వ తేదీన చంద్రబాబు, లోకేశ్, 17న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు తిరిగి ప్రయాణమవుతారని తెలిసింది.













