ఏపీలో మూడు అంతర్జాతీయ స్డేడియంలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పీపీపీ విధానంలో విశాఖ, గుంటూరు, తిరుపతిలో మూడు అంతర్జాతీయ క్రీడా స్టేడియాలు నిర్మించనున్నట్లు క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కో స్టేడియం నిర్మాణం కోసం రూ.100 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు రూ.5 లక్షలు, వెండి పతకానికి రూ.3 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.2 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన వివరించారు. ఇందుకోసం రూ.3 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సచివాలయంలో ఆయన పర్యాటక, క్రీడలు సాంస్క•తిక, పురావస్తుశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ నెల 20న పర్యాటకశాఖపై ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్ష సమావేశంలో కొత్త పర్యాటక విధానాన్ని ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతిస్తున్నందున ఈలోగా మౌలిక సదుపాయల పనులు పూర్తి చేయిస్తామని అన్నారు.













