పవన్ సినిమాల్లో మాత్రమే హీరో.. రాజకీయాల్లో కాదు.. ముద్రగడ వైరల్ స్టేట్మెంట్..
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ పూర్తి ఫోకస్ పిఠాపురం పైన పెడుతోంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పవన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మీ గొప్పేమిటి అంటూ ముద్రగడ,పవన్ పై విమర్శల ఆస్త్రాలు కురిపించాడు. రాజకీయాల్లో తమ కుటుంబం ఎప్పటినుంచో ఉంది అని గుర్తు చేసిన ముద్రగడ.. ఈరోజు రాజకీయం లో ఏబీసీడీలు కూడా తెలియని వారు తనను విమర్శిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. పవన్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ.. నువ్వు సినిమాల్లో మాత్రమే హీరో వి.. రాజకీయాలలో కాదు అని ఎద్దేవా చేశారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. అని కామెంట్ చేసిన ముద్రగడ.. రాజకీయాలలో మాత్రం పవన్ తో పోల్చుకుంటే తానే హీరో అని స్పష్టం చేశారు. ఒకప్పుడు వైసీపీ వ్యవస్థాపకలలో ఒకటిగా ఉన్నప్పటికీ.. జగన్ తో కలిసి నడవాలి అని భావించినప్పటికీ.. కొన్ని శక్తుల కారణంగా తాను ఆ పని చేయలేకపోయాను అని పేర్కొన్న ముద్రగడ్డ ఇప్పటికైన వైసీపీలోకి రావడం సంతోషంగా ఉంది అని అన్నారు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించారు ముద్రగడ. అంతేకాదు తనని చంద్రబాబు ఘోరంగా అవమానించిన సందర్భంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలి అని భావించినట్లు పేర్కొన్నారు. రుద్రగడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వైరల్ అయింది.













