వైసీపీ ఒప్పుకుంటే తక్షణం రాజీనామా చేస్తా..
గుడివాడ క్యాసినోతో మంత్రి కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రిని అన్యాయంగా ఇరికిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు? క్యాసినో డబ్బు ఎవరికి వెళ్లింది? ప్రశ్నించారు. ఇటీవల సినిమా టికెట్ల ధరలపై సీఎంతో చర్చిచేందుకు వెళ్లిన సినీనటుడు చిరంజీవిపై మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై అనర్హత వేటు వేయించలేమని వైసీపీ ఒప్పుకంటే తక్షణం రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును సీఎం జగన్ నిలిపివేయించారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని లోక్సభ స్పీకర్ని కోరినట్లు తెలిపారు. పీఆర్సీ అంశంపై స్పందిస్తూ ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుతుందని, సంక్షేమ కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ విధి అని తెలిపారు.













