పవన్ స్పీచ్ మధ్యలో మోడీ.. అసలు కథ అదే..
చిలకలూరిపేట వేదికగా జరుగుతున్న ప్రజాగళం బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఇక ఈ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీని మరీ ముఖ్యంగా జగన్ ను టార్గెట్ చేసి ఓ రేంజ్ లో ప్రసంగించారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట సంచలనమే అనడంలో ఎటువంటి డౌట్ లేదు. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో సడన్గా ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. సభలో జనం ఎక్కువగా ఉండడంతో.. వేదిక పైన నాయకులు కనిపించక కొందరు ధైర్యం చేసి ఫోకస్ లైట్ టవర్స్ పైకి ఎక్కేశారు. వీరిని గమనించిన ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకొని వారిని కిందకి దిగాలని విజ్ఞప్తి చేశారు. మైకు వద్దకు వచ్చిన మోదీ’అలా చేయడం వల్ల మీ ప్రాణాలు పోతాయి దయచేసి కిందకు దిగాలని వేడుకుంటున్నాను’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా పోలీసులకు వారిని కిందకు దించవలసిందిగా సూచనలు ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫోకస్ లైట్ టవర్స్ ఎక్కిన జనాలను కిందకు దించారు. అంత పెద్ద సభలో ఇంత చిన్న విషయాన్ని కూడా పరిశీలించి ఎవరికీ ఎటువంటి హాని కలగకూడదు అని భావించిన ప్రధాని మోదీ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.













