మోడీ మాటలకు అర్థం ఏమిటి చంద్రన్న..?
టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా చిలకలూరిపేట, బొప్పిడి వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో మోడీ చెప్పిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎంతో భారీ ఎత్తున నిర్వహించిన ఈ సభలో ఇటు పవన్ గురించి కానీ అటు చంద్రబాబు గురించి కానీ మోడీ అభినందిస్తూ మాట్లాడకపోవడంపై చర్చలు జరుగుతున్నాయి. అభివృద్ధి జరగాలి అంటే కేంద్రంలోనే కాక రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కారు ఉండాలి అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లు వేయండి అని అనకుండా ఎన్డీయే కూటమికి ఓట్లు వేయండి అని అన్నారు. మోడీ మాటలు చంద్రబాబుకి పెద్ద షాక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండాలి అని చంద్రబాబు ఆశిస్తున్నారు. అయితే నిన్న మోడీ ప్రసంగించిన మాటలలో నిగూడార్థం మరొక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇన్ డైరెక్ట్ గా రాష్ట్రంలో కూడా తమ పార్టీ వాళ్లే పాలనలో ఉండాలి అన్నట్లు మోడీ మాటలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. ఎంతసేపటికి ఎన్డీయే కూటమిని గెలిపించండి అన్నారే తప్ప చంద్రబాబును సీఎం చేయండి అని మోడీ అనలేదు. ప్రస్తుతం దీనిపై జోరుగా డిస్కషన్ జరుగుతోంది.













