Nagababu :ఎమ్మెల్యే కోటాలో మండలికి నాగబాబు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC elections) సహా వివిధ అంశాలపై గంటపాటు ఇద్దరూ చర్చించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై ఇద్దరూ కొద్దిసేపు చర్చించారు. ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో ఒకటి నాగబాబు (Nagababu )కు ఖరారు చేశారు. సీఎం చంద్రబాబు శాసనసభలో తన స్థానంలో కూర్చుని ఉండగా, పవన్ కల్యాణ్ ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ఛాంబర్‌కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్ (Budget) లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తన అభ్పిప్రాయాలు చెప్పారు.













