ఎమ్మెల్యే కోలగట్లకు కోవిడ్ పాజిటివ్

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ విజృభిస్తున్న కరోనా ప్రజాప్రతినిధులను వదిలిపెట్టడం లేదు. తాజాగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కరోనా బారిన పడ్డారు. ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‍గా తేలింది. రెండు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కూడా పరీక్షించుకోవాలని కోలగట్ల కోరారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.