మంత్రి లోకేష్ అమెరికా పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 17, 18,19 తేదీల్లో అమెరికాలో జరిగే వరల్డ్ పుడ్ ఫ్రైజ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా తిత్లీ తుపాన్ గ్రామాలు పూర్తి స్థాయిలో కోలుకొని, సాధారణ స్థితికి వచ్చే వరకు శ్రీకాకుళంలోనే ఉండాలని మంత్రి లోకేష్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం తిత్లీ తుపాన్ ప్రాంతంలో ఉండి అక్కడ సహాయక పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేష్ ఆ మూడు రోజులు అక్కడే ఉండి సహాయక చర్యలతోపాటు అక్కడి మౌలిక వసతులు త్వరగా కల్పించేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికిచ్చే అత్యున్నత పురస్కారమే వరల్డ్ పుడ్ ప్రైజ్ కాగా భారతదేశ వ్యవసాయం రంగం-టెక్నాలజీ అనుసంధానంతో దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై ఈ నెల 18న కీనోట్ ప్రసంగం ఇవ్వాలని వరల్డ్ పుడ్ ప్రైజ్ నుండి మంత్రి లోకేష్‌కి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.













