Gottipati: ఒకసారి నమ్మినందుకే 20 ఏళ్లు వెనక్కి : మంత్రి గొట్టిపాటి
విద్యార్థుల చదువులకు రూ.10వేల కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తమదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో పీటీఎం 2.0 కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. 450 మంది విద్యార్థుల (Students) కు ఉచితంగా మంత్రి సైకిళ్లు (Bicycles) పంపిణీ చేశారు. అర్హులందరికీ తల్లికి వందనం నిధులు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు. జగన్ మాయ మాటలను మరోసారి నమ్మేందుకు ప్రజలు (People) సిద్ధంగా లేరని, ఒకసారి నమ్మి మోసపోయినందుకే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.













