రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స పర్యటన
ఆంధప్రదేశ్ రాజధాని ప్రాంత పరిధిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహంతో కలిసి తుళ్లూరు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, మంత్రుల క్వార్టర్లు, ఐఏఎస్ల క్వార్టర్లు, పర్మినెంట్ సెక్రటేరియెట్, గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్లు, హైకోర్టు తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంట్రాక్టు సంస్థలైన ఎన్సీపీ, ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలకు చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు నిర్మాణాలకైన ఖర్చులు, నాణ్యతా వివరాలు, మిగిలిపోయిన నిర్మాణాలకయ్యే వ్యయం మొదలైన వివరాలపై ఆరా తీశారు. మంత్రి తొత్సను కలసి వినతిపత్రం సమర్పించిన తుళ్లూరు మండల మాజీ ఎంపీపీ హరీంద్రనాథ్ చౌదరి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం నిలిపేస్తానని ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదని, రైతులకు ఇవ్వాల్సిన కౌలు డబ్బులు వెంటనే చెల్లించడంతోపాటు నిలిచిన నిర్మాణ పనులను కొనసాగిస్తామని మంత్రి తెలిపారని చెప్పారు.













