రాష్ట్రంలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే రాబోతోంది
రాష్ట్రంలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడపలో ఎంపీ రమేష్తో కలిసి మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ బలంగా ఉందనటానికి అసంతృప్తి లేకపోవడమేనన్నారు. కమలాపురం, రాయిచోటి, ప్రోద్దుటూరు, బద్వేల్ లో భంగపడ్డ ఆశావాహులను బుజ్జగించామన్నారు. కలిసి కట్టుగా పార్టీ గెలుపు కోసం పని చేస్తామని అసంతృప్తి నేతలు సృష్టం చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ బాబు సీఎం కావాల్సిన అవసరముందన్నారు. ఇన్ని కేసులున్నా వాటిపై నోరు మెదపని జగన్.. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కూడా మాట్లాడడం లేదన్నారు. త్వరలో ప్రోద్దూటూరు సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు.













