రాష్ట్ర ప్రయోజనాల కోసమే … ప్రధాని పదవి కోసం కాదు
ప్రధాని పదవిని చంద్రబాబు ఆశించడం లేదని.. రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమిని ఏర్పాటు చేస్తుందని, నాయకత్వం మాత్రం వహించబోదని సృష్టం చేశారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయటంలో భాగంగానే రాహుల్‌గాంధీతో చర్చలకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీయేలో చేరామని, బీజేపీ నయవంచనకు పాల్పడడంతో బయటకు వచ్చేశామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరుస్తామని రాహుల్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. ఈ కారణంగానే రాహుల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటురన్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని తెలిపారు.













