Nara Lokesh:పవన్ సవాల్‌ను స్వీకరిస్తున్నా .. విద్యాశాఖ ద్వారానే : మంత్రి లోకేశ్
విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటుతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాల (ZP School ) లో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం చంద్రబాబు (Chandrababu)తో పాటు మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారు. తరగతి గదిలో జీవిత పాఠాలు చెప్పేది మన గురువు. మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులే. మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ. తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం. పదో తరగగతి, ఇంటర్ విద్యార్థులు (Inter students) అద్భుతంగా రాణిస్తున్నారు. షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశాం. గత ప్రభుత్వం లో విద్యార్థులకు నాణ్యతలేని యూనిఫామ్‌లు ఇచ్చారు. పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ జరుగుతోంది. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సవాల్ విసిరారు. పవన్ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం అని తెలిపారు.













