విశాఖ జిల్లా నుంచే మంత్రి లోకేశ్ పోటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం జిల్లా నుంచి పోటీ చేసే విషయం దాదాపు ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితి ప్రకారం విశాఖ ఉత్తరం, భీమిలి సీట్లలో ఒకదాని నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తన తండ్రి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున తాను ఉత్తరాంద్ర నుంచి పోటీ చేయాలనుకొంటున్నారు. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.
ప్రస్తుతం విశాఖ ఉత్తరం నుంచి బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, భీమిలి నుంచి ఆ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేశ్ భీమిలిలో పోటీ చేయాలనుకొంటే మంత్రి గంటా విశాఖ ఉత్తరం లేదా విశాఖ ఎంపీ సీటుకు మారే అవకాశం ఉంది. లోకేశ్ విశాఖ ఉత్తరంలో పోటీ చేయాలను కొంటే మంత్రి భీమిలిలోనే పోటీ చేస్తారని సమచారం.













