ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌పై టీడీపీ, జనసేనలు అవగాహన లేకుండా విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో దుర్వినియోగం అయిన నిధులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి రూపాయి నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాలేదని తెలిపారు. తెలుగు అకాడమీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ వస్తాయని తెలిపారు. తెలుగు భాషను బతికించేంది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని చెప్పారు. చంద్రబాబు వారసుడు ఎవరతో త్వరలో తేలబోతుందన్నారు. టీడీపీ నేతలు స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు.













