సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి… ఎన్నికల గుర్తు కేటాయింపు
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఈసీ కేటాయించింది. ఆయన సారథ్యంలోని భైభారత్ నేషనల్ పార్టీకి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్‌గా టార్చిలైట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కామన్ సింబల్ కేటాయించడం పట్ల ఈసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీని స్థాపించారు.













