శ్రీశైలం దసరా ఉత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ ఎం. హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న, దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రి జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం జగన్‌ను ఆహ్వానించారు.













